Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్.. కాల్పుల్లో ఉగ్రవాది హతం

by Shiva |   ( Updated:2024-11-06 04:06:12.0  )
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్.. కాల్పుల్లో ఉగ్రవాది హతం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌ (Jammu & Kashmir)లో మంగళవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని ఉగ్రవాది హతం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బందిపోరా (Bandipora) జిల్లాలోని చూంట్‌పత్రి (Choontpatri) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ (Indian Army), జమ్ముకశ్మీర్ పోలీసులు (Jammu Kashmir Police), సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (Cordon and search operation)ను నిర్వహించారు.

ఈ క్రమంలోనే కెట్సున్ (Ketsun) అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతుండగా.. ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. భీకరంగా కొనసాగిన ఈ ఎదరుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. అదేవిధంగా ఓ ఆర్మీ జవాన్‌తో పాటు సీఆర్‌పీఎఫ్ (CRPF) జవానుకు గాయాలయ్యాయి. ఈ మేరకు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. చూంట్‌పత్రి (Choonpatri), కెట్సున్ (Ketsun) అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story