- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాబోయే 24 గంటలు అలెర్ట్‌గా ఉండండి.. జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాలకు హెచ్చరిక
దిశ, నేషపల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాల్లో విపరీతమైన మంచు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ శనివారం ప్రజలకు కీలక హచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో కుప్వారా, గందర్‌బల్ జిల్లాలపై 2500 మీటర్ల ఎత్తులో హిమపాతం సంభవించే అవకాశం ఉందని 'మధ్యస్థ' ప్రమాద స్థాయి హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, హిమపాతం సంభవించే ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఏదైనా సహాయం కావాలనుకునే వారు 112 నంబర్‌కు డయల్ చేయమని ప్రజలను కోరారు.
ఇప్పటికే జమ్మూకశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో హిమపాతం కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. అలాగే ఏప్రిల్ 13, 15 మధ్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. అంతకుముందు, మార్చి 29న జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ టూరిస్ట్ రిసార్ట్‌లో హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల కూడా ప్రజలు, టూరిస్ట్‌లు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అలాగే, హిమపాతం సంభవించే ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.