ఖగోళంపై ఇస్రో గురి.. జనవరి 1న XPoSat ప్రయోగం

by Hajipasha |   ( Updated:2023-12-31 13:47:12.0  )
ఖగోళంపై ఇస్రో గురి.. జనవరి 1న XPoSat ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో : కొత్త సంవత్సరంలో మొదటి రోజున కొత్త ప్రయోగానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రెడీ అవుతోంది. దాని పేరే.. ‘ఎక్స్-రే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌’ (XPoSat). జనవరి 1న ఉదయం 9:10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌పోశాట్‌‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఎక్స్‌పోశాట్‌‌ అనేది ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ. ఇది బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలపై అధ్యయనం చేయనుంది. ప్రపంచంలో ఇప్పటివరకు అంతరిక్షంలోకి ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీని పంపిన ఏకైక దేశం అమెరికా మాత్రమే. జనవరి 1న జరగనున్న ప్రయోగంతో ఈ జాబితాలో అమెరికా తర్వాతి స్థానంలో భారత్ నిలువనుంది. గతంలో అమెరికా తరఫున నాసా ప్రయోగించిన ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ పేరు.. ఇమేజింగ్ ఎక్స్-రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ (IXPE). చంద్రయాన్-3, ఆదిత్య L-1 విజయాల ఊపులో ఉన్న ఇస్రో ఇప్పుడు మరో విజయాన్ని అందుకునేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రయోగాన్ని ఇస్రో అధికారిక వెబ్‌సైట్, ఇస్రో యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్ పేజీలలో లైవ్‌లో చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed