- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ISRO: డిసెంబర్‌లో ప్రోబా-3 లాంచ్ చేయనున్న ఇస్రో
దిశ, నేషనల్ బ్యూరో : ఇస్రో(ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గానైజేషన్) డిసెంబర్‌లో యూరోపియన్ యూనియన్స్ ప్రోబా 3ను లాంచ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మంగళవారం తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియన్ స్పేస్ కాంక్లేవ్ 3.0లో ఆయన మాట్లాడారు. ఇండియాకు చెందిన స్పేస్ సైంటిస్టులు యూరోప్‌తో కలిసి సూర్యుడికి సంబంధించిన మిస్టరీలను కనుగొంటారని పేర్కొన్నారు. ప్రోబా-3 పీఎస్ఎల్వీతో లాంచ్ చేయబడుతుందని.. ఇస్రో దీన్ని ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు. సూర్యుడి సోలార్ రిమ్ వద్ద ఉన్న మందమైన కొరోనాను ఈ ప్రయోగం స్టడీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. శ్రీహరి కోట నుంచి అంతరిక్షానికి డిసెంబర్‌లో ప్రోబా-3ను పంపనున్నామన్నారు. ఇస్రో, యూరోపియన్ యూనియన్ స్పేస్ సైంటిస్టులు ఉమ్మడిగా సూర్యుడి వద్ద ఉన్న వాతావరణాన్ని స్టడీ చేస్తారని తెలిపారు. ప్రోబా-3 రెండు శాటిలైట్‌లతో పనిచేస్తూ 144 మీటర్ల సోలార్ కొరొనాగ్రాఫ్‌ను ఉత్పన్నం చేయనున్నాయి. దీంతో సూర్యుడి సోలార్ డిస్క్ నుంచి వెలువడే కాంతి సమయంలో కొరొనాను స్టడీ చేయవచ్చన్నారు. వచ్చే కొన్నేళ్లలో గ్లోబల్ స్పేస్ ఎకనమీకి భారత్ తన సహకారాన్ని 2 శాతం నుంచి 10 శాతానికి పెంచున్నందని ఆయన తెలిపారు.