బ్రేకింగ్: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

by Satheesh |   ( Updated:2023-07-14 10:14:07.0  )
బ్రేకింగ్: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్ -3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఇవాళ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి నిప్పులు చిమ్ముతూ ఎల్‌వీఎం 3ఎం రాకెట్ ద్వారా చంద్రయాన్ -3 నింగిలోకి వెళ్లింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి చంద్రయాన్ -3ని ప్రయోగించారు. మూడు దశల్లో చంద్రయాన్-3 ప్రయోగం జరగనుండగా.. ఇప్పటికి రెండు దశలు విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ చంద్రుడిలోని దక్షిణ ద్రువంలో ల్యాండ్ కానుంది. ఇప్పటివరకు జాబిల్లిపై ఎవరూ చేరుకోని దక్షిణ ధ్రువానికి చంద్రయాన్-3 వెళ్లనుంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న చంద్రయాన్-3 ఆగస్ట్ 23 లేదా 24వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఇక, ప్రతిష్టాత్మక చంద్రయాన్ - 3 రాకెట్ సక్సెస్ ఫుల్‌గా లాంఛకావడంతో ఇస్రో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story