Chandrayaan-3 : ప్రయోగానికి సిద్ధమవుతున్న చంద్రయాన్-3

by Vinod kumar |   ( Updated:2023-07-05 14:21:36.0  )
Chandrayaan-3 :  ప్రయోగానికి సిద్ధమవుతున్న చంద్రయాన్-3
X

బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు చురుకుగా చేస్తోంది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్‌కు ఎల్‌వీఎం3 అనే కొత్త హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికిల్‌ను బుధవారం జత చేసింది. చంద్రయాన్-3 అనేది చంద్రయాన్-2కు ఫాలో ఆన్ మిషన్. చంద్రునిపై రాళ్లు, దుమ్ము, ధూళి, ఇతర పదార్థాలకు సంబంధించి, చంద్ర భూకంపం, చంద్ర ఉపరితల ప్లాస్మా పర్యావరణం, మూలక కూర్పు యొక్క థర్మోఫిజికల్ లక్షణాలను అధ్యయనం చేయడానికి శాస్త్రీయ పరికరాలతో కూడిన చంద్రయాన్-3ను ఈ నెల 13వ తేదీన ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రయోగ సమయంలో ఎదుర్కొనే కఠినమైన కంపన, ధ్వని వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని ధ్రువీకరించే పరీక్షలను చంద్రయాన్-3 ఈ ఏడాది మార్చి నెలలో విజయవంతంగా పూర్తి చేసింది. ఎల్‌వీఎం3 ద్వారా ప్రయోగించే చంద్రయాన్-3 వ్యోమ నౌక.. ప్రొల్షన్, ల్యాండర్, రోవర్ అనే మూడు మాడ్యూళ్లతో కూడి ఉంది.

Advertisement

Next Story