- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్.. నలుగురు బందీల విడుదల
దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగట్లేదు. కొంతకాలంగా వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్ మరోసారి సెంట్రల్ గాజాపై విరుచుకుపడింది. అందులో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న నలుగురిని కాపాడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నుసిరత్ లోని రెండు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. అందులో భాగంగానే వారిని రక్షించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచి.. ఎక్కువ సంఖ్యలో బందీలను కాపాడటం ఇదే తొలిసారి. దీంతో, ఇప్పటివరకు ప్రాణాలతో బయటపడ్డ వారి సంఖ్య ఏడుకు చేరింది.
హమాస్ బందీలుగా 250 మంది
గతేడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ భూభాగంలోకి వెళ్లిన హమాస్.. అక్కడ ఉగ్రదాడికి పాల్పడింది. అప్పుడే 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించింది. నవంబరులో కాల్పుల విరమణ జరిగింది. ఆ టైంలో దాదాపు సగం మంది విడుదలయ్యారు. ఇంకా 130 మందికిపైగా బందీలుగా ఉన్నారని టెల్‌అవీవ్ చెబుతోంది. అయితే, వారిలో 20 మంది వరకు చనిపోయినట్లు భావిస్తోంది. మే నెలలో ముగ్గురి డెడ్ బాడీలో దొరికాయి. ఇటీవలే జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో దాదాపు 21 మంది చనిపోయారు.