వైద్యపరమైన నిర్లక్ష్యం కేసుల్లో దర్యాప్తు అధికారి బీఎన్ఎస్ కింద రక్షణ కల్పించాలి

by S Gopi |
వైద్యపరమైన నిర్లక్ష్యం కేసుల్లో దర్యాప్తు అధికారి బీఎన్ఎస్ కింద రక్షణ కల్పించాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: వైద్యపరమైన నిర్లక్ష్యం కేసుల్లో దర్యాప్తు అధికారి భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) కింద రక్షణ కల్పించాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. రోగికి చికిత్స చేస్తున్నప్పుడు వైద్యుడికి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం ఉండదని, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌లో నిర్లక్ష్యం జరగదని పేర్కొంది. 'చికిత్స సమయంలో మరణం సంభవించడం హత్య కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంగీకరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 26లో ఈ అంశం ఉంది. దర్యాప్తు అధికారి వైద్యపరమైన నిర్లక్ష్యం కేసుల్లో దీన్ని అమలు చేయాలని ఐఎంఏ అభ్యర్థిస్తోంది. వైద్యపరమైన నిర్లక్ష్యం కేసుల్లో నిబంధన, అరుదైన కేసుల్లో నిర్లక్ష్యం జరిగినప్పుడు దర్యాప్తు అధికారి నిపుణుల కమిటీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వొచ్చని' ఐఎంఏ లేఖలో పేర్కొంది. ఇదే అంశంపై ఐఎంఏ అధ్యక్షుడు దా ఆర్‌వి అశోకన్.. బీఎన్ఎస్‌లోని సెక్షన్ 26 వైద్యులు క్రిమినల్ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టంగా చెబుతోంది. అయితే, సెక్షన్ 106.1 కింద ఉన్న నిబంధనను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా వైద్యులు క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయించబడతారు. కొత్త చట్టాల్లో వైద్యపరమైన నిర్లక్ష్యం, సెక్షన్ 26 నిబంధనను పాటించని కేసుల్లో పోలీసులు సెక్షన్ 106.1 కింద వైద్యులపై అభియోగాలు మోపారు. ఒక నేరానికి తప్పనిసరిగా నేరపూరిత ఉద్దేశం ఉండాలి. నేరపూరిత ఉద్దేశం లేని పక్షంలో మాత్రమే వైద్యులను సివిల్ లా కింద మాత్రమే వైద్యులు బాధ్యత వహించగలరు. దీని ప్రకారం డాక్టర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయించేందుకు ఐఎంఏ కట్టుబడి ఉందని అశోకన్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed