Mutual Funds Invesors: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు సెబీ కొత్త రూల్స్.. ఎప్పటి నుంచి అమలు అంటే..!

by Maddikunta Saikiran |
Mutual Funds Invesors: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు సెబీ కొత్త రూల్స్.. ఎప్పటి నుంచి అమలు అంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు (Mutual Funds Invesors)కు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఇటీవలే కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గైడ్ లైన్స్(Guidelines) నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సెబీ ప్రకటించింది. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(AMC) నిర్వహించే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే వ్యక్తులు, ట్రస్టీలు, వారి సమీప బంధువులకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయని తెలిపింది. ఈ న్యూ రూల్స్ ప్రకారం వారికి సంబంధించిన వారెవరైనా ఒక పాన్‌కార్డు(Pancard) ద్వారా రూ. 15 లక్షలకు మించి చేపట్టే అన్ని ట్రాన్సాక్షన్ల వివరాలను (Transactions Details) రెండు రోజుల్లోగా కంప్లయెన్స్‌ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒక త్రైమాసికంలో సింగిల్‌ లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ల విలువ రూ. 15 లక్షల లిమిట్ దాటితే తాజా నిబంధనలు వర్తించనున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే నెల నుంచి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు త్రైమాసికవారీగా సంబంధిత అధికారులు, ట్రస్టీలు, సమీప బంధువుల హోల్డింగ్స్‌ వివరాలను సెబీకి వెల్లడించవలసి ఉంటుందని తెలిపింది. అలాగే అక్టోబర్ 31, 2024 వరకు ఉన్న పెట్టుబడులకు సంబంధించిన వివరాలను వచ్చే నెల 15వ తేదీన నాటికి స్టాక్ ఎక్స్చేంజీల్లో (Stock Exchanges) నమోదు చేయాలని సెబీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed