Municipal Commissioner : కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ బదిలీ..

by Sumithra |
Municipal Commissioner : కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ బదిలీ..
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి ( Kamareddy ) మున్సిపల్ కమిషనర్ సుజాత బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను వరంగల్ జిల్లా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ ( Municipal Commissioner ) గా బదిలీ చేశారు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న ఆమె కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఏడాది కూడా కామారెడ్డిలో పని చేయకుండానే బదిలీ కావడం వెనుక బలమైన కారణం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కాగా కామారెడ్డికి కొత్త కమిషనర్ ను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. దీంతో ఇక్కడికి కమిషనర్ గా ఎవరు రాబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పని చేయాలంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోవడం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed