- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bhumana Karunakar Reddy: షర్మిల రాజకీయంగా ఒంటరి అయ్యారు.. భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల (YS Sharmila) రాజకీయంగా ఒంటరి అయ్యారని టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Former Chairman Bhumana Karunakar Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) కుమారుడిగా జగన్ (Jagan) ఇప్పటి వరకు ఏ తప్పూ చేయలేదని కామెంట్ చేశారు. వైఎస్ జగన్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట కోసం సర్వం వదులుకుంటారని పేర్కొన్నారు.
కుట్రలు, కుతంత్రాలతో తనపై తప్పుడు కేసులు (False Cases) పెట్టినా.. ఎలాంటి బెదురు లేకుండా వీరుడిలా పోరాడుతున్నాడని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా.. కోట్లాది మంది జనం జగన్ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. కుటుంబ, రాజకీయ విమర్శలతో తోడబుట్టిన అన్న జగన్ (Jagan)ను, షర్మిల (Sharmila) నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అశేష ప్రజల ప్రేమాభిమానాలు పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టను షర్మిల దిగజార్చేలా చేయడం బాధాకరమని అన్నారు.