AP News:టపాసుల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

by Jakkula Mamatha |
AP News:టపాసుల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ
X

దిశ ప్రతినిధి,పుట్టపర్తి: ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపిన అటువంటి వారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయించాలని చట్టం సూచించిన నిబంధనలు ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. అనుమతులు పొందిన వారు కేటాయించిన ప్రదేశాలలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని టపాసుల విక్రయాలు చేయాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని లైసెన్స్ లు కల్గిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా , అనుమతులు లేకుండా దీపావళి మందు గుండు సామాగ్రి కలిగి ఉన్నా, తయారుచేసినా లేదా అనధికార ప్రదేశాలలో నిల్వ ఉంచినా , విక్రయాలు జరిపినా అటువంటి వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక వాహనాన్ని, అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేసి దీపావళి పండుగ సజావుగా నిర్వహించే విధంగా తీసుకోవాలని ఎస్పీ గారు ఆదేశించారు. దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చే సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ - 100 లేదా డయల్ 112 కి గాని లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని, సమాచారం చేరవేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లాలోని టపాసుల విక్రయదారులు అందరూ నిబంధనలన్నీ తప్పక పాటించాలని ఎస్పీ తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed