INS Arighat : నేవీ అమ్ములపొదిలోకి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’

by Hajipasha |   ( Updated:2024-08-29 12:36:16.0  )
INS Arighat : నేవీ అమ్ములపొదిలోకి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’
X

దిశ, నేషనల్ బ్యూరో : ఐఎన్ఎస్ అరిఘాత్ .. ఇది అణువిద్యుత్ టెక్నాలజీతో నడిచే బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గామి. గురువారం రోజు విశాఖపట్నంలో దీన్ని భారత నేవీకి అందజేశారు. ఐఎన్ఎస్ అరిహంత్ అనే సబ్ మెరైన్ ఇప్పటికే భారత నేవీ వద్ద ఉంది. దాన్ని అప్‌గ్రేడ్ చేసి అధునాతన అణువిద్యుత్ టెక్నాలజీతో పనిచేసేలా తీర్చిదిద్ది ఐఎన్ఎస్ అరిఘాత్‌ అనే పేరు పెట్టారు. కే-15 రకానికి చెందిన బాలిస్టిక్ మిస్సైళ్లను సైతం శత్రు లక్ష్యాల వైపుగా ప్రయోగించగల సామర్థ్యం దీని సొంతం.

ఈ మిస్సైళ్లు 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. దీనివల్ల సముద్ర జలాల్లో భారత నేవీ బలం మరింత పెరగనుంది. మరో విషయం ఏమిటంటే.. ఐఎన్ఎస్ అరిఘాత్‌‌ను పూర్తిస్థాయిలో విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లోనే తయారు చేశారు. 2017లో మొదలైన దీని నిర్మాణ పనులు ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయ్యాయి. అన్ని రకాల టెస్టింగ్‌లను నిర్వహించిన అనంతరం నేవీకి అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed