Indian student: బ్రిటన్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన వ్యక్తి మృతి

by vinod kumar |
Indian student: బ్రిటన్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన వ్యక్తి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ వ్యక్తి మరణించగా.. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరగగా లీసెస్టర్‌షైర్ (Livenstan shire) పోలీసులు తాజాగా వివరాలు వెల్లడించారు. ఆంద్రప్రదేశ్‌కు చెందిన పంగులూరి శ్రీనివాస్ (32) అనే వ్యక్తి బ్రిటన్‌లో నివాసముంటూ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన మిత్రులతో కలిసి లీసెస్టర్ నుంచి మార్కెట్ హార్బరో వైపు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కారులో ఉన్న ఓ మహిళ సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. ఓ 27 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, మృతి చెందిన వ్యక్తి సహా గాయపడిన వారంతా ఆంద్రప్రదేశ్‌కు చెందిన వారేనని పలు కథనాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed