ఏడాదిలోగా ఎన్నికలు వస్తాయి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
ఏడాదిలోగా ఎన్నికలు వస్తాయి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ కూటమిపై ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, రాజస్థాన్ సీఎం భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ‌ల ప‌ద‌వుల‌కు ఎస‌రొచ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మోడీపై విమర్శలు

నరేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజుకు మూడు సార్లు దుస్తుల‌ను మార్చే వారు అదే డ్రెస్‌తో రోజుకు మూడు స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఏం తింటున్నాం, తాగుతున్నాం, ఏ దుస్తులు వేసుకుంటున్నామ‌నేది వారు ఇక ప‌ట్టించుకోర‌ని చురకలు అంటించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లు బీజేపీకి స‌రైన గుణ‌పాఠం నేర్పార‌ని అన్నారు. ప్రభుత్వాలను కూల్చేసి, సీఎంలను జైళ్లో పెట్టి, విపక్షాలను బెదిరించే వారికి ప్రజలు సరైన జవాబిచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed