China : చైనాకు చెక్.. భారత్, అమెరికా కీలక ఒప్పందం

by Hajipasha |
China : చైనాకు చెక్.. భారత్, అమెరికా కీలక ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సెమీ కండక్టర్ల తయారీకి కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ లాంటి అరుదైన ఖనిజ వనరులు అత్యవసరం. ప్రస్తుతానికి వీటి కోసం భారత్ సహా చాలా దేశాలు చైనాపై ఆధారపడుతున్నాయి. డ్రాగన్‌పై ఈవిధంగా ఆధారపడకుండా ఉండే మార్గాన్ని భారత్ అన్వేషించింది. ఇందులో భాగంగా అమెరికాతో ఓ అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా, భారత్‌లు అరుదైన ఖనిజ వనరుల లభ్యతను పెంచేందుకు ప్రత్యేకమైన సప్లై చైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్యశాఖ మంత్రి గీనా రాయిమోండో సంతకాలు చేశారు. 14 ప్రపంచ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌ను కలుపుకొని ‘మినరల్స్ సెక్యూరిటీ పార్ట్‌నర్‌షిప్’ గ్రూపును అమెరికా గతంలో ఏర్పాటు చేసింది. దానిలోనూ భారత్ సభ్యత్వాన్ని కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed