- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ల్యాబ్‌లో చేప మాంసం తయారీ.. రీసెర్చ్ బరిలోకి భారత్
దిశ, నేషనల్ బ్యూరో : మనదేశంలో నానాటికీ చేప మాంసం వినియోగం పెరుగుతోంది. అయితే ఆ వినియోగానికి తగిన స్థాయిలో చేపలు అందుబాటులో ఉండటం లేదు. ఈనేపథ్యంలో తొలిసారిగా ల్యాబ్‌లో చేపల మాంసాన్ని తయారుచేసే ఒక రీసెర్చ్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం చేపట్టింది. దీని బాధ్యతలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్‌ఐ) తీసుకుంది. ల్యాబ్‌లో సముద్ర చేపల మాంసాన్ని తయారు చేసేందుకు ఉద్దేశించిన రీసెర్చ్ ప్రాజెక్టులు ప్రస్తుతం అమెరికా, సింగపూర్, ఇజ్రాయెల్ దేశాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఇండియా కూడా చేరిపోయింది. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే భవిష్యత్తులో సీ ఫుడ్ కోసం వేటపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని, మార్కెట్‌లో చేప మాంసం కొరత లేకుండా చూడొచ్చని భావిస్తున్నారు. ల్యాబ్‌లో చేప మాంసం రెడీ అయితే ఫిష్ మాంసం ధరలు కూడా దిగొస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ప్రయోగాలన్నీ పూర్తయి కృత్రిమ చేప మాంసం మార్కెట్‌లోకి రావడానికి పదేళ్లు పట్టొచ్చని సీఎంఎఫ్ఆర్‌ఐ శాస్త్రవేత్త కాజల్ చక్రవర్తి తెలిపారు.
తొలివిడతలో ఆ చేపలపైనే ట్రయల్స్..
ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ రకాల చేపల మాంసం నుంచి నిర్దిష్ట కణజాలాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో కృత్రిమంగా పెంచుతారు. ఈ కణజాలాలు పెరిగి ఏర్పడే చేప మాంసం ముక్కల రుచి, ఆకృతి, పోషక విలువలు అచ్చం నిజమైన చేపమాంసంలాగే ఉంటాయని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) ప్రాతిపదికన ఈ రీసెర్ఛ్ ప్రాజెక్టు అమలవుతుందని, ఇందుకోసం నీట్ మీట్ బయోటెక్ అనే స్టార్టప్‌తో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జట్టుకట్టిందని శాస్త్రవేత్త కాజల్ చక్రవర్తి వెల్లడించారు. ప్రయోగ పరీక్షల తొలి విడతలో కింగ్ ఫిష్, పాంఫ్రెట్, సీయర్ ఫిష్ వంటి అత్యంత ఖరీదైన సముద్ర చేపల మాంసాన్ని ల్యాబ్‌లో తయారు చేయడంపై రీసెర్చ్ జరుగుతుందని ఆయన వివరించారు.