- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘స్మార్ట్’ సక్సెస్.. మన నేవీకి మరో అస్త్రం.. ఏమిటిది ?
దిశ, నేషనల్ బ్యూరో : సముద్రంలో సైనిక బలాన్ని పెంచుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత నౌకాదళం సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్ఫిడో(SMART)ను బుధవారం ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించగా, విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. సముద్రంలో దాగి ఉన్న శత్రువుల జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే విషయంలో సాధారణ టార్ఫిడోల కంటే ‘స్మార్ట్’ మిస్సైల్ ఎక్కువ వేగాన్ని, రేంజును కలిగి ఉంటుంది. దీన్ని పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేశారు. స్మార్ట్ క్షిపణి వ్యవస్థలో రెండు దశల సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్, ఎలక్ట్రో మెకానికల్ యాక్యుయేటర్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ ఉంటాయి. SMART క్షిపణిని యుద్ధనౌకల నుంచి, తీర ప్రాంతాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. గ్రౌండ్ మొబైల్ లాంచర్ నుంచి దీన్ని శత్రువుల లక్ష్యం దిశగా సంధించవచ్చు. ‘స్మార్ట్’ ట్రయల్స్ విజయవంతమైన సందర్భంగా డీఆర్డీవోను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. “ఈ వ్యవస్థ అభివృద్ధి మన నౌకాదళ బలాన్ని మరింత చేస్తుంది’’ అని ఆయన చెప్పారు.