- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
India vs Canada: అమిత్‌షాపై కెనడా ఆరోపణలకు భారత్ సీరియస్ కౌంటర్.. సమన్ల జారీ
దిశ, వెబ్‌డెస్క్: మన దేశ హోం శాఖా మంత్రి అమిత్ షా (Amit Shah)పై కెనడా ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కెనడా (Canada) హై కమిషనర్‌ను పిలిచి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. కెనడాలో నిజ్జర్ (Nijjar) హత్యతో పాటు ఖలిస్థానీ (Khalisthan) సానుభూతిపరులపై జరుగుతున్న జరుగుతున్న దాడుల వెనుక భారతదేశ (India) పాత్ర ఉందంటూ ట్రూడో ప్రభుత్వంలోని మంత్రి డేవిడ్ మారిసన్ (David Morrison) కొద్ది రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత ప్రభుత్వం.. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, అసంబద్ధమైనవని కొట్టి పారేసింది.
కెనడా మంత్రి ఆరోపణలపై శనివారం మీడియాతో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randheer Jaiswal).. ‘‘కెనడా మంత్రి డేవిడ్ మారిసన్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఆమె చేసిన పనికిమాలిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని దిగజార్చడానికే కెనడా ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా ఇతర దేశాలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ మీడియాకు భారత వ్యతిరేక సమాచారాన్ని కెనడా అధికారులే లీక్ చేస్తారు. అందుకే ఈ విషయంలో కెనడా హైకమిషనర్ (Canada High Commissioner)ను పిలిచి అధికారికంగా సమన్లు జారీ చేశాం. ఆ దేశ మంత్రి వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పాం’’ అని వెల్లడించారు.