భారత్‌కు శక్తివంతమైన నాయకుడు కావాలి: జైశంకర్

by Harish |
భారత్‌కు శక్తివంతమైన నాయకుడు కావాలి: జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికి భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం అన్నారు. సిమ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, గ్లోబల్‌గా కొనసాగుతున్న వివాదాలు అంత త్వరగా ముగిసే అవకాశం లేనందున, ఈ విషయంలో నిలకడగా ఉండటానికి భారత్‌‌లో స్థిరమైన ప్రభుత్వం, శక్తివంతమైన నాయకుడు అవసరమని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా-ఇరాన్‌లలో వివాదాలు కొనసాగుతున్నాయి, అలాగే భారత సరిహద్దుల్లో కూడా సమస్యలు ఉన్నాయి, వాటిని ఎదుర్కొడానికి భారత్‌కు బలమైన నాయకత్వం ఉందని అందరికి స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఆయన అన్నారు. భారత సరిహద్దుల్లో కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఓటర్లందరూ కూడా తెలివిగా తమ నాయకుడిని ఎన్నుకోవాలని మోడీని ఉదహరిస్తూ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు.

దేశరక్షణ గురించి మాట్లాడిన మంత్రి, చైనా 1962లో తీసుకున్న భూమిలో సరిహద్దులో రోడ్లు, వంతెనలు, మోడల్ గ్రామాన్ని నిర్మిస్తోంది. అలాగే, పాకిస్తాన్ సమన్వయంతో సియాచిన్‌కు రహదారిని నిర్మించింది. భారత్ కూడా మన బలగాలను మోహరించింది, చైనా సరిహద్దులో మెరుగైన లాజిస్టిక్స్, మౌళిక సదుపాయాలను అభివృద్ది చేయడానికి భారత్ సరిహద్దు బడ్జెట్‌ను రూ.3,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Next Story