PM Modi:ఇండియా ఫుడ్ సర్ ప్లస్ కంట్రీ: పీఎం మోడీ

by Prasad Jukanti |
PM Modi:ఇండియా ఫుడ్ సర్ ప్లస్ కంట్రీ: పీఎం మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం ఆహార మిగులు దేశమని, ప్రపంచ ఆహార భద్రత మరియు ప్రపంచ పోషకాహార భద్రత కోసం కృషి చేయడంలో తమ దేశం నిమగ్నమై ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలో వ్యవసాయ ఆర్థిక వేత్తల 32వ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశం రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రైతుల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం సంస్కరణలు, చర్యలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు చెప్పా్రు. ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యవసాయమే కేంద్రం అని మిల్లెట్‌లు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రబాగాన ఉందన్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో సుస్థిర వ్యవసాయంపై పెద్దఎత్తున దృష్టి సారించామని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం కొత్త వాతావరణాన్ని తట్టుకోగల వెయ్యి 900 రకాల పంటలను అందించిందని చెప్పారు. భారతదేశం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఒక్క క్లిక్‌తో పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చహౌన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed