Jaishankar on china: చైనాతో భారత్ కు తలనొప్పిగా సరిహద్దు సమస్య

by Shamantha N |
Jaishankar on china: చైనాతో భారత్ కు తలనొప్పిగా సరిహద్దు సమస్య
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాతో భారత్‌కు ఉన్న సంక్లిష్ట సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ కు చైనాతో ఉన్న సమస్య ఇంకాస్త ఎక్కువ అని తెలిపారు. ఎకనామిక్ టైమ్స్ కార్యక్రమంలో చైనా సమస్యపై జైశంకర్ మాట్లాడారు. ఏదేశానికి వెళ్లినా చైనా గురించే చర్చించుకుంటూ ఉంటారు. యూరప్‌ వెళితే చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక, జాతీయభద్రత ముప్పు గురించి తెలుస్తోంది. అమెరికా వెళ్లినా ఇలాంటి సమస్యే వస్తుంది. కాబట్టి చైనాతో భారత్‌కు మాత్రమే సమస్య లేదని అన్నారు.

చైనా సమస్యను పట్టింకోలేదు

గతకొంతకాలం వరకు ప్రపంచ దేశాలు చైనా సమస్యను పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అదే సమస్యగా మారిందన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు చైనాతో మనకున్న సవాల్ ను తీవ్రంగా గమనించాల్సిందని అన్నారు. మరీ ముఖ్యంగా సరిహద్దు పంచుకుంటున్నందున మన దేశం.. అందుకు తగినట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. చైనా నుంచి పెట్టుబడులు ఆహ్వానించవద్దని.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు జరపవద్దని భావించట్లేదన్నారు. కాకాపోతే, పెట్టుబడుల విషయంలో నిశిత పరిశీలన అవసరం అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed