‘ఇండియా’ పాజిటివ్.. ఎన్నికల ఫలితాలపై విపక్షం ఆశాభావం

by Hajipasha |
‘ఇండియా’ పాజిటివ్.. ఎన్నికల ఫలితాలపై విపక్షం ఆశాభావం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు తుది విడత పోలింగ్ ఘట్టం.. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కార్యక్రమాలు జరుగుతున్న వేళ శనివారం సాయంత్రం ఇండియా కూటమి భేటీ అయింది. ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది. జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈసందర్భంగా చర్చించారు. పోలింగ్ సరళి, ఫలితాలపై డిస్కస్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఎం, డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) తదితర పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ), పీడీపీ (మెహబూబా ముఫ్తీ) ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఈ మీటింగ్ సందర్భంగా ఇండియా కూటమి పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనాలని డిసైడ్ చేశారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, కౌంటింగ్ సన్నాహాలు, భవిష్యత్తు కార్యాచరణపైనా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘పోరు ఇంకా ముగియలేదు. ఫారం 17సీ, ఈవీఎంల విషయంలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శక్తివంచన లేకుండా మేమంతా లోక్‌సభ ఎన్నికల్లో పోరాడాం. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారని భావిస్తున్నాం. సానుకూల ఫలితాలు వస్తాయన్న విశ్వాసంతో ఉన్నాం’’ అని పేర్కొంటూ ఖర్గే ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story