- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్ : నిర్మలా సీతారామన్
దిశ, వెబ్‌డెస్క్: గత తొమ్మిదేళ్ల తమ పాలనలో 10వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ పద్దులు ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 11.7 కోట్ల గృహాలకు టాయిలెట్లను నిర్మించామన్నారు. ఉజ్వల యోజన పథకం ద్వారా 9.6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామన్నారు.
102 కోట్ల మంది భారతీయులకు 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించామని స్పష్టం చేశారు. పీఎం జన్ ధన్ యోజన పథకంలో భాగంగా 47.8 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిపించామన్నారు. పీఎం సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా పథకంలో భాగంగా 44.6 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11.4 కోట్ల మంది రైతులకు రూ.2.2లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు. పర్ క్యాపిటా ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. పర్ క్యాపిటా రూ. 1.97 లక్షలకు చేరిందన్నారు.
ఇవి కూడా చదవండి: పొరుగు దేశాల కవ్వింపు.. రక్షణ శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట