Gallantry and Service Medals: దేశవ్యాప్తంగా 1037 మందికి పతకాలు

by Shamantha N |
Gallantry and Service Medals: దేశవ్యాప్తంగా 1037 మందికి పతకాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1037 మందికి కేంద్రప్రభుత్వం గ్యాలంట్రీ, సర్వీసు పతకాలను (Gallantry and Service Medals) అందజేయనుంది. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు కేంద్రహోంశాఖ పతకాలు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. కాగా.. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం దక్కింది. దేశం మొత్తం మీద ఒక్క పోలీసు అధికారికే ఈసారి పతకం అందజేయనున్నారు. చైన్ స్నాచింగ్‌లు, ఆయుధాల వ్యాపారంలో ప్రమేయం ఉన్న ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ ని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అయితే, వారిని పట్టుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై నిందితులిద్దరు కత్తితో దాడి చేశారు. యాదయ్య శరీరంపై పలుసార్లు కత్తితో దాడి చేశారు. గాయాలు అయినప్పటికీ నిందితుడ్ని పట్టుకున్నాడు. దాదాపు 17 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. ఇకపోతే, గ్యాలంట్రీలో 213 మెడల్స్‌, పీఎంజీలో ఒక మెడల్‌, 94 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 729 మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలు ప్రకటించింది. ఇక గ్యాలంట్రీలో తెలంగాణకు 7 మెడల్స్‌ దక్కాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంటుంది.

Advertisement

Next Story

Most Viewed