ఎన్నికల వేళ బడ్జెట్‌లో కర్ణాటకకు వరాలు

by GSrikanth |   ( Updated:2023-02-01 14:19:57.0  )
ఎన్నికల వేళ బడ్జెట్‌లో కర్ణాటకకు వరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి సారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకపై వరాలు కురిపించింది. ఆ రాష్ట్రానికి రూ.5,300 కోట్ల కేంద్ర నిధులు కేటాయించింది. కర్ణాటక రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాల్లో సాగునీటి సరఫరా కోసం ఈ నిధులను వెచ్చిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే కర్ణాటకకు ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం తెలుగు రాష్ట్రాలను విస్మరించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేథ్యంలో ఆ రాష్ట్రానికి నిధులు ఇచ్చి తెలుగు రాష్ట్రాలకు విస్మరించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. మరో వైపు వైద్య రంగంలో తెలంగాణ కు మొండి చెయ్యి చూపింది కేంద్రం. దేశంలో భారీగా మెడికల్ కాలేజీలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో గతంలో మెడికల్ కాలేజ్ లు ఇచ్చిన దగ్గరనే మళ్ళీ 157 నర్సింగ్ కాలేజ్ లను కేంద్రం ప్రకటించింది.

Also Read...

మధ్యతరగతికి 'దేఖో అప్నా దేశ్' పథకం

Advertisement

Next Story

Most Viewed