- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో బీజేపీకి కష్టాలు.. మిషన్ సౌత్ పై కాషాయ పార్టీ ఆశలు గల్లంతేనా..!
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో బీజేపీ, జనతాదళ్ సెక్యులర్ పొత్తు పెట్టుకున్నాయి. కర్ణాటకలోని 28 స్థానాలకు గానూ 25 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. వొక్కలిగ వర్గానికి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జేడీఎస్ పోటీ చేస్తుంది. దీంతో కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టే.. కర్ణాటక మాజీ సీఎం బొమ్మై కూడా బీజేపీ,జేడీఎస్ ఒప్పందాన్ని ప్రశంసించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేతకు మోడీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బొమ్మై గుర్తుచేశారు.
చిక్ బల్లాపూర్ లో ఘర్షణ
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బీజేపీ, జేడీఎస్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కూటమి విచ్ఛిన్నం చేసేలా క్షేత్రస్థాయిలో పరిణామాలు జరుగుతున్నాయి. చిక్ బల్లాపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కే.సుధాకర్ పేరుని ప్రకటించింది హైకమాండ్. బొమ్మై ప్రభుత్వంలో సుధాకర్ వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ.. సుధాకర్ అభ్యర్థిత్వం వల్ల బీజేపీ, జేడీఎస్ మధ్య గొడవలు చెలరేగాయి. చిక్ బల్లాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని యలహంక ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ కు ఈ నిర్ణయం నచ్చలేదు. విశ్వనాథ్ తన కుమారుడు అలోక్ విశ్వనాథ్ ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని కోరుతున్నారు. విశ్వనాథ్ మద్దతుదారుల నుంచి కూడా సుధాకర్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. గో బ్యాక్ సుధాకర్ అని ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. సుధాకర్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు, ప్లకార్డులతో నిరసనకు దిగారు. మరోవైపు, ఈ వివాదం పరిష్కరించేందుకు పార్టీ అగ్రనేతలను కలుస్తారని సమాచారం.
తుమకూరులో ఉద్రిక్తత
తుమకూరులోనూ బీజేపీ, జేడీఎస్‌ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక్కడ జరిగిన ఉమ్మడి సమావేశంలో గతంలో ప్రత్యర్థులుగా ఉన్న ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. కూటమి అభ్యర్థి సోమన్నకు ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప.. బీజేపీ నేత కొండజ్జి విశ్వనాథ్‌కి వేలు చూపించడంతో గొడవ మొదలైంది. సోమన్న గురించి విశ్వనాథ్ మాట్లాడేందుకు యత్నించగా కృష్ణప్ప అడ్డుకున్నారు. దీంతో గొడవ జరిగింది. ఇకపోతే హసన్ లోనూ ఇలాంటి గొడవలే జరిగాయి.
బీజేపీ, జేడీఎస్‌ల మధ్య చిన్న,చిన్న విభేదాలు
మరోవైపు ఇరు పార్టీల సీనియర్ నాయకులు క్షేత్రస్థాయిలో సమన్వయం గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఆందోళనలు తగ్గాయని సీనియర్లు తెలుపారు. చిన్న, చిన్న తగాదాలు వచ్చినా తూమకూరులో గెలుస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్సి సీటీ రవి అన్నారు.మాండ్యాలో జేడీఎస్ గెలుస్తుందని.. ఒకరికొకరం సాయం చేసుకుంటామని అన్నారు. విబేధాలు వచ్చినా.. పరిష్కరించుకుని కలిసి పనిచేస్తామని జేడీఎస్ అధినేత హెచ్‌డి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి అన్నారు. కొత్త కూటమి అని.. రెండు పార్టీల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇకపోతే కర్ణాటకలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న తొలి దశ, మే 7న రెండో దశలో పోలింగ్ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో 28 స్థానాలకు గానూ 25 స్థానాల్లో కమలం జెండా ఎగురవేసింది. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కొక్కటి గెలవగా.. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.