ఆసుప‌త్రిలో బ‌ర్త్‌డే పార్టీ.. ర‌చ్చ‌ర‌చ్చ చేసి, చివ‌రికి ఇలా..?! (వీడియో)

by Sumithra |
ఆసుప‌త్రిలో బ‌ర్త్‌డే పార్టీ.. ర‌చ్చ‌ర‌చ్చ చేసి, చివ‌రికి ఇలా..?! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః య‌వ్వ‌నం ఎంత విలువైన‌దో అంత విచ‌క్ష‌ణార‌హితంగానూ త‌యార‌వుతోంద‌ని కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చూస్తే అర్థ‌మ‌వుతుంది. చ‌దువుకున్నోళ్ల కంటే అక్ష‌రంముక్క రానోళ్లే న‌యం అన్న‌ట్లు స‌మాజం పోక‌డ మారుతోంది. లేక‌పోతే, ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌క‌పోతే ఎంత జ్ఞానం ఉండి ఉప‌యోగం ఏముంటుంది? సెల‌బ్రేష‌న్లు వ్య‌క్తికి ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ వాటికీ కొని హ‌ద్దులుంటాయి. పుట్టినరోజు పార్టీని నిర్వహించడానికి ఒక నిర్దిష్ట సమయం, స్థలం ఉంది. అయితే, ఆ స్థలం ఖచ్చితంగా ఆసుపత్రి మాత్రం కాదు! ఒక‌వేళ అయినా, దానికంటూ కొన్ని నిబంధ‌న‌లుండాలి. అలా కాకుండా, ఇటీవల, లక్నోలోని ఒక ఆసుపత్రిలో ఓ యువ‌కుల‌ బృందం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియోలో ఈ గుంపు ఆసుప‌త్రిలో ర‌చ్చ‌ సృష్టించడం, మాక్ బెల్ట్-ఫైట్‌లో చిరాకు క‌లిగించ‌డం చూడొచ్చు. ఆదివారం అర్ధరాత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారని, రోగులను కలవరపరిచేలా దాదాపు గంటపాటు ఈ రచ్చ కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొందరు వ్యక్తులు ముఖానికి కేక్ పూసుకుని నానా హంగామా సృష్టించార‌ని పేర్కొన్నారు. వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ తర్వాత, రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, సివిల్ హాస్పిటల్ OPD లోపల పుట్టినరోజు వేడుకల వైరల్ క్లిప్‌పై విచారణకు ఆదేశించారు. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నామని సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఓజా తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed