- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విదేశాలకు వెళ్లే ఆలోచనే లేదు.. పాక్ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
లాహోర్: నో-ఫ్లై లిస్ట్‌లో పేరును చేర్చడంతో అధికార సంకీర్ణ అగ్రనేతలపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. తనకు విదేశాల్లో ఆస్తులు గానీ వ్యాపారాలు గానీ లేవని.. విదేశాలకు వెళ్లే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ, ఇతర నాయకులు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతలుగానీ దేశం విడిచి వెళ్లకుండా పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. ‘నాకు విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు. నా పేరును ఈసీఎల్‌లో ఉంచినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు విదేశాలలో ఆస్తులు గానీ, వ్యాపారాలు గానీ లేవు. అంతేకాదు బ్యాంక్ ఖాతా కూడా లేదు.
ఒకవేళ ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తే ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతానికి వెళతాను. ఎందుకంటే ఈ భూమ్మీద నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అదే’ అని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈసీఎల్ అంటే ది ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్. దీనిని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో వ్యక్తులు ఎవరైనా దేశం విడిచి వెళ్లేందుకు ఇది మనుమతించదు. దేశం విడిచి వెళ్లకుండా ఇమ్రాన్, ఆయన భార్యతో పాటు 80 మందిపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించినట్టు గురువారం స్థానిక మీడియా వెల్లడించింది. ఎందుకంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎం-ఎన్) అగ్రనేత నవాజ్ షరీఫ్‌తో సహా ఆ పార్టీ నేతలు యూకేలో భారీగా సంపదను కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.