IIT Delhi: లోథాల్ పురావస్తు ప్రదేశంలో ప్రమాదం.. ఐఐటీ ఢిల్లీ పరిశోధక విద్యార్థి మృతి

by vinod kumar |
IIT Delhi: లోథాల్ పురావస్తు ప్రదేశంలో ప్రమాదం.. ఐఐటీ ఢిల్లీ పరిశోధక విద్యార్థి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌ (Gujarath)లోని లోథాల్ (Lothal) పురావస్తు ప్రదేశంలో మట్టి గోడ కుప్పకూలడంతో ఐఐటీ ఢిల్లీకి చెందిన పరిశోధక విద్యార్థిని మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రీసెర్చ్ నిమిత్తం ఆ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ ఢిల్లీకి చెందిన పీహెచ్‌డీ స్కాలర్ సురభివర్మ (23), మరో నలుగురితో కూడిన బృందం పరిశోధన పనుల నిమిత్తం మట్టి నమూనాను సేకరించేందుకు అహ్మదాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన సింధులోయ నాగరికత ప్రాంతానికి వెళ్లారు. మట్టిని తీసేందుకు ఓ పది అడుగుల లోతున్న గొయ్యిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే గొయ్యి పక్కన ఉన్న మట్టి గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో సుర్భి వర్మ (Surbi varma) అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికి అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సురభి వర్మను ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ నివాసిగా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed