జ్ఞానవాపి మసీదు కమిటీ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
జ్ఞానవాపి మసీదు కమిటీ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

వారణాసి (యూపీ) : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వేపై స్టే విధించాలని కోరుతూ జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ వేసిన అప్పీల్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సర్వే వల్ల కట్టడం పడిపోవచ్చనే మసీదు నిర్వహణ కమిటీ ఆందోళనతో హైకోర్టు ఏకీభవించలేదు. నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగదని ఏఎస్‌ఐ ఇచ్చిన హామీని విశ్వసించలేకపోతే కోర్టు ఇచ్చే తీర్పును ఎలా విశ్వసిస్తారని మసీదు కమిటీని ప్రశ్నించింది.

మసీదు నిర్మాణం కూలిపోతే హిందూ పక్షం బాధ్యత వహించాల్సి ఉంటుందనే మసీదు కమిటీ వాదనలపై స్పందనగా ఈ కామెంట్ చేసింది. అయోధ్య రామజన్మభూమి కేసులో జరిగిన సర్వేకు, జ్ఞానవాపి మసీదులో జరిగే సర్వేకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వాదించింది. జ్ఞానవాపి మసీదు కింద ఉన్న దేవాలయం గురించిన చర్చ కల్పితమని మసీదు కమిటీ తరఫు న్యాయవాది అన్నారు.

Advertisement

Next Story

Most Viewed