ఓపెనింగ్‌కి నోచుకోని పబ్లిక్ టాయిలెట్స్..

by Aamani |
ఓపెనింగ్‌కి నోచుకోని పబ్లిక్ టాయిలెట్స్..
X

దిశ,తల్లాడ : మండల పరిధిలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నూతనంగా టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. కానీ నిర్వహణ లేక నిరూపయోగంగా టాయిలెట్స్ ఉన్నాయి. పేరుకు మాత్రమే, కానీ ఇప్పటికి మాత్రం ఓపెనింగ్ కి నోచుకోలేదు. నిరంతరం తహసీల్దార్ కార్యాలయానికి, గ్రామ పంచాయతీ కార్యాలయానికి రోజుకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. స్త్రీలు పురుషులు మూత్ర విసర్జనకు,కాలకృత్యాలు తీర్చుకోవటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అది మాత్రం దిష్టిబొమ్మల టాయిలెట్స్ లా మిగిలిపోయిందని, వేలు ఖర్చు పెట్టి కట్టిన టాయిలెట్స్ వృధాగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడం ద్వారా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మండల అధికారులు టాయిలెట్స్ ను ఉపయోగకరం లోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed