సియోల్ సిటీ మాదిరిగా హైదరాబాద్ డెవలప్‌మెంట్..రేవంత్ సర్కార్ దూకుడు

by srinivas |   ( Updated:2024-10-21 04:48:52.0  )
సియోల్ సిటీ మాదిరిగా హైదరాబాద్ డెవలప్‌మెంట్..రేవంత్ సర్కార్ దూకుడు
X

దిశ,వెబ్ డెస్క్: విజన్ 2050తో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt).. హైదరాబాద్ సిటీ(Hyderabad City) అభివృద్ధి, మూసీ నది(Musi River) సుందరీకరణ పనులపై దూకుడు పెంచింది. భవిష్యత్ అవసరాలకోసం హైదరాబాద్ పట్టణాన్ని దక్షిణ కొరియా(South Korea) మాదిరిగా డెవలప్ మెంట్ చేయాలని భావిస్తోంది. హైదరాబాద్‌కు, సియోల్‌(Seoul)కు దగ్గర పోలికలు ఉండటంతో ఆ నగరాన్ని రేవంత్ సర్కార్ ఎంచుకుంది. ఒక్కప్పుడు సియోల్ పట్టణంలో మూసీలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సిటీగా మారింది.


సియోల్ సిటీలో అభివృద్ధి ఎలా సాధ్యమైంది. ఆ మోడల్‌ను హైదరాబాద్‌‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే అనే అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మంత్రి పొన్నం, పొంగులేటి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు ఎమ్మెల్యేలు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. సియోల్ సిటీలో అభివృద్ధిని పరిశీలించారు. చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మోపో ప్లాంట్‌ను సందర్శించారు. సియోల్‌లో నదులను సుందరీకరణ చేసిన విధానంపై అధ్యయనం చేస్తు్న్నారు. మూసీ పునరుజ్జీవంలో సియోల్ మోడల్ అమలుపై పరిశీలిన చేస్తున్నారు. హాన్ నదితో పాటు పలు నదులను పరిశీలించారు. 30 ఏళ్లలో సియోల్ సిటీలో చాలా అభివృద్ధి జరిగిందని, ఇలానే హైదరాబాద్‌ను డెవలప్ చేయాలని నిర్ణయించారు. మరో మూడు రోజులు పాటు సియోల్‌లో పర్యటించి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల బృందం నివేదిక అందించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed