అబ్బాయిలకు గుడ్‌న్యూస్.. రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే.. నిరాకరించితే జీవితఖైదీ శిక్ష..!

by Anjali |   ( Updated:2024-04-05 11:27:54.0  )
అబ్బాయిలకు గుడ్‌న్యూస్.. రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే.. నిరాకరించితే జీవితఖైదీ శిక్ష..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా దేశంలో వెరైటీ వివాహ సంప్రదాయం ఉంది. ఆ దేశంలో పుట్టిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. ఇది అక్కడి సంప్రదాయం మాత్రమే కాదు.. చట్టం కూడా. ఒకవేళ రెండో పెళ్లికి నో చెబితే కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఏకంగా జీవిత ఖైదీ శిక్ష వేస్తారు. ఈ చట్టం కేవలం పురుషులకే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఎరిట్రియా దేశానికి చెందిన ప్రతి స్త్రీ తన భర్త రెండో పెళ్లికి అంగీకరించాలి. మరో మహిళతో కలిసి తన భర్తను పంచుకోవాలి. మొదటి భార్య ఇందుకు అంగీకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇక ఆ దేశంలో పుట్టిన స్త్రీలు చచ్చినట్లు రెండో పెళ్లికి ఒప్పుకోవాల్సిందే.

కానీ భారతీయ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. రెండో పెళ్లి చేసుకుంటే తప్పక జైలుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ ఎరిట్రియా దేశంలో రెండో పెళ్లి చేసుకోవడం వార్త విన్న జనాలు ఏం సంప్రదాయం రా బాబు.. కోర్టు ఎలా అనుమతించింది అసలు? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed