- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
‘ఇండియా’ పేరును మార్చే ప్రతిపాదన వస్తే ఆమోదిస్తాం : ఐరాస
by Vinod kumar |
X
న్యూఢిల్లీ : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. పేర్ల మార్పులపై దేశాల నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తరఫు డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ వెల్లడించారు.
‘ఇండియా పేరు ఇంగ్లీష్‌లో కూడా భారత్ అని మారనుందా ?’ అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. గత ఏడాది టర్కీ దేశం కూడా పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే, సానుకూలంగానే పరిగణనలోకి తీసుకుంటామని తేల్చి చెప్పారు.
Advertisement
Next Story