IAS Officers: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఐఏఎస్‌లపై సస్పెన్షన్ వేటు

by Shiva |   ( Updated:2024-11-12 03:34:04.0  )
IAS Officers: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఐఏఎస్‌లపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను కేరళ (Kerala)లోని లెఫ్ట్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు (IAS Offcers) కె.గోపాలకృష్ణన్ (K.Gopala Krishnan), ఎన్.ప్రశాంత్‌ (N.Prashanth)లపై సస్పెన్షన్ వేటు వేసింది. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ (Whatsaap Group)ను క్రియేట్ చేసినందుకు గోపాలకృష్ణన్ (Gopala Krishnan)ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా సోషల్ మీడియా (Social Media)లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ప్రశాంత్‌ (Prashanth)పై చర్యలు తీసుకున్నారు.

చీఫ్ సెక్రటరీ శాదర మురళీధరన్ (CS Sarada Muralidharan) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించడంతో ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం గోపాలకృష్ణన్ (Gopala Krishnan) పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్‌గా, ప్రశాంత్ (Prshanth) వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Next Story