రేపు భారత్ చేరనున్న 12 చీతాలు..

by Vinod kumar |
రేపు భారత్ చేరనున్న 12 చీతాలు..
X

భోపాల్: దేశంలో రెండో విడత చీతాలు శనివారం ప్రవేశించినున్నట్లు పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను సీ-17 భారత వాయు దళ రవాణా విమానం ద్వారా తీసుకురానున్నట్లు చెప్పారు. ఇప్పటికే విమానం దక్షిణాఫ్రికాకు బయలుదేరింది, మధ్యప్రదేశ్ కునో జాతీయ పార్కులు ఈ చిరుతలను క్వారెంటైన్లో ఉంచేందుకు 10 ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నెలల వాయిదా తర్వాత 12 చీతాలు భారత్ చేరుకోనున్నాయి. వీటిలో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం దక్షిణాఫ్రికా గౌటెంగ్‌లోని తాంబో అంతర్జాతీయ విమానశ్రయం నుంచి బయలుదేరనున్నాయి. గతేడాది 8 చీతాలను నమిబీయా నుంచి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటికి సరైన సంరక్షణ అందిస్తున్నామని, అన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయని అన్నారు. ప్రపంచంలోనే 7 వేలకు పైగా చీతాలు దక్షిణాఫ్రికా, నమీబియా, బొత్సవానాలో ఉన్నాయి. వీటిలో అత్యంత ఎక్కువ సంఖ్య నమిబీయా లో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed