ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. కాంగ్రెస్ నేత రషీద్ అల్వి

by Mahesh |
ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. కాంగ్రెస్ నేత రషీద్ అల్వి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు హర్యానా అసెంబ్లీకి ఒకే విడతలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో అనేక ఎగ్జిట్ పోల్స్ మొత్తం.. హర్యాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జమ్మూ-కాశ్మీర్‌లో ఎన్సీ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందిన ఎగ్జిట్ ఫోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ ఫోల్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్‌పై నాకు పెద్దగా నమ్మకం లేదు. కానీ హర్యానాలో బీజేపీకి వ్యతిరేకంగా వేవ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ(హర్యానా)లో 60-70 సీట్లు గెలిచే అవకాశం ఉంది. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఈ క్రమంలో హర్యానా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story