- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Supreme Court: నా శత్రువులనూ గౌరవిస్తాను: సీజే డీవై చంద్రచూడ్
దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన వీడ్కోలు సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నేను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి మీకు తెలుసు. బహుశా అత్యధికంగా ట్రోల్స్ ఎదుర్కొన్న న్యాయమూర్తిని నేను అనుకుంటా! వారికి నేనో కవిత్వం వినిపించాలనుకుంటున్నాను. ప్రత్యర్థుల విమర్శలు నన్ను మరింత రాటుదేలేలా చేస్తాయి. నా శత్రువులనూ గౌరవిస్తాను. విషపూరిత ట్రోలింగ్ ఎదుర్కొన్నాను. కానీ, వాటిని సులువుగా స్వీకరించగలను’ అని వివరించారు. సరదాగా మాట్లాడుతూ.. ‘సోమవారం నుంచి నన్ను ట్రోల్ చేసిన వారి పరిస్థితి ఏమిటీ? వారు నిరుద్యోగులు అవుతారు’ అని కామెంట్ చేశారు. ఈ నెల 10వ తేదీన ఉద్యోగ విరమణ అవుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు శుక్రవారం లాస్ట్ వర్కింగ్ డే.
తోటి న్యాయమూర్తులతో సత్సంబంధాలను కొనసాగించానని చెబుతూ.. ‘మేం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. కానీ, ఎన్నడూ మా మధ్య విభేదాలకు ఆస్కారమివ్వలేదు. ప్రతి సమావేశం నవ్వులతో సంతోషంగానే జరిగింది. మేం మా వ్యక్తిగత అజెండాలతో సమావేశాలకు రాలేదు. వ్యవస్థ ప్రయోజనాలే లక్ష్యంగా మేం హాజరయ్యాం’ అని సీజే చంద్రచూడ్ వివరించారు. తమ ప్రొఫెషన్ రోజూ కొత్త విషయాలు నేర్పుతుందని, కొత్త పరిస్థితులు చూపిస్తుందని తెలిపారు. కొత్త సమాచారాన్ని, విధానాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
తండ్రి వైవీ చంద్రచూడ్(మాజీ సీజేఐ) క్రమ శిక్షణ గురించి సీజే చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘మా నాన్న పూణెలో ఒక చిన్న ఫ్లాట్ కొన్నారు. ఎందుకు అని అడిగాను. ఆయనకు తెలుసు నేను అక్కడ ఉంటానని.. నాతో ఇలా చెప్పాడు ‘నువ్వు జడ్జీగా రిటైర్ అయ్యేదాకా ఈ ఫ్లాట్‌ను విక్రయించకుండా అంటిపెట్టుకునే ఉండాలి. ఎప్పుడైనా వృత్తిగత జీవితంలో నీ నైతిక విలువలు దిగజారే క్షణాలు వస్తున్నాయని అనిపించినప్పుడు నీకు ఈ ఫ్లాట్ ఉన్నదనే విషయం గుర్తుకు రావాలి. నువ్వు తలదాచుకోవడానికి ఒక ఫ్లాట్ ఉందనే గమనింపు నిత్యం నీలో ఉండాలి’ అని వివరించారు.