భారీ పేలుడు.. 10 మంది మైనర్ కార్మికులు స్పాట్ డెడ్

by samatah |
భారీ పేలుడు.. 10 మంది మైనర్ కార్మికులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ బ్లాస్టింగ్‌లో పదిమంది బాల కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ పేలుడు వెస్ట్ సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో సంభవించింది. భారీ సంఖ్యలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిథేన్‌తో సహా పలు వాయువులు లీకవ్వడం వల్ల జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story