- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియాసీ ఉగ్రదాడి కేసు ఎన్ఐఏకు అప్పగింత
దిశ, నేషనల్ బ్యూరో: రియాసీ ఉగ్రదాడి కేసును కేంద్రహోంమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ ఘటనపై ఉపా చట్టం కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇటీవలే శివ్‌ఖోరీ ఆలయం నుంచి మాతా వైష్ణవిదేవి గుడికి బయల్దేరిన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ వాహనంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. దీనిపై ఉగ్రమూక కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోయారు. 33 మంది గాయపడ్డారు. ఈకేసుపై ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. దాడి వెనుక పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టింది.
50 మంది అనుమానితులు
విచారణలో భాగంగా ఇప్పటికే 50 మంది అనుమానితులను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, భద్రతాదళాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరి స్కెచ్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా అతని ఆచూకీ తెలిపే వారికి రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాట చేశారు. అమర్ నాథ్ యాత్రకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.