- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక కాంగ్రెస్‌లో మిగిలేది ముస్లిం ఎమ్మెల్యేలే : సీఎం హిమంత
దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో కొంతమంది ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ అన్నారు. ఎమ్మెల్యేలు రకీబుల్ హుస్సేన్, రకీబుద్దీన్ అహ్మద్, జాకీర్ హుస్సేన్ సిక్దార్, నూరుల్ హుదాతో పాటు మరికొంత మంది మాత్రమే కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతారని వ్యాఖ్యానించారు. ఈమేరకు ముస్లిం ఎమ్మెల్యేల పేర్లను విలేకరుల ఎదుట సీఎం చదివి వినిపించారు. బిశ్వనాథ్ జిల్లాలోని గోహ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసోం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రాణా గోస్వామి బీజేపీలో చేరుతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం హిమంత బదులిస్తూ.. ‘‘దాని గురించి నాకు సమాచారం లేదు. ఆయన కాంగ్రెస్‌లో శక్తివంతమైన నాయకుడు. బీజేపీలో చేరితే స్వాగతిస్తాను. ఏ రాజకీయ నాయకుడైనా నిర్ణయం తీసుకునే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పిజూష్ హజారికా మాట్లాడుతూ.. ‘‘సీఎం చెప్పిన పేర్లు తప్ప మిగతా కాంగ్రెస్ నాయకులంతా మాతో టచ్‌లో ఉన్నారు’’ అని చెప్పారు.