- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Himanta Biswa Sarma: త్వరలోనే లవ్ జిహాద్ చట్టం.. అసోం సీఎం బిస్వ శర్మ
దిశ, నేషనల్ బ్యూరో: తమ ప్రభుత్వం లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని అమలు చేస్తుందని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ అన్నారు. దానిని ఉల్లంఘించిన వారికి జీవిత ఖైదు విధిస్తామనే నిబంధనను కూడా తీసుకొస్తామని తెలిపారు. ఆదివారం గౌహతిలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ‘లవ్ జిహాద్’ పై మాట్లాడామని, అలాంటి కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు విధించే చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అంతేగాక త్వరలో కొత్త డొమిసైల్ పాలసీని ప్రవేశపెడతామని దీని ద్వారా అసోంలో జన్మించిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య భూముల విక్రయానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అటువంటి లావాదేవీలను ప్రభుత్వం నియంత్రించలేదని, అయితే అలాంటి ఒప్పందాలకు సీఎం అనుమతి పొందడం తప్పనిసరి చేస్తామన్నారు.