మహిళలకు ప్రతినెలా రూ.1500.. కాంగ్రెస్ సర్కారు ప్రకటన

by Hajipasha |
మహిళలకు ప్రతినెలా రూ.1500.. కాంగ్రెస్ సర్కారు ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆరుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కారు కీలకమైన సంక్షేమ పథకాన్ని అనౌన్స్ చేసింది. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ‘ఇందిరాగాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి యోజన’ పేరుతో స్కీం‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏప్రిల్ నుంచి ప్రతినెలా రూ.1500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం వెల్లడించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ప్రజలకు ఇచ్చిన 10 హామీల్లో ఐదు అమల్లోకి వచ్చినట్లయిందని తెలిపారు. ఈ స్కీం కోసం ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం చెప్పారు. దాదాపు 5 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారన్నారు.

Advertisement

Next Story

Most Viewed