బెంగళూరులో అత్యధిక వర్షపాతం..133ఏళ్ల రికార్డు బ్రేక్

by vinod kumar |
బెంగళూరులో అత్యధిక వర్షపాతం..133ఏళ్ల రికార్డు బ్రేక్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. రాష్టంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూన్ నెలలో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతానికి సంబంధించిన 133 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ చేసింది. జూన్ 2వ తేదీన బెంగళూరులో 111.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో1891 జూన్ 16న నగరంలో 101.6 మిమీ వర్షపాతం నమోదు కాగా.. ఆ రికార్డుకు తాజా బ్రేక్ పడింది. రెండు రోజుల్లో ఏకంగా 140.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావడం గమనార్హం. దీంతో మూడు రోజుల పాటు బెంగళూరు నగరానికి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 5వ తేదీ వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి100కు పైగా చెట్లు నేలకొరిగాయి, చెట్ల కొమ్మలు రోడ్లు, ఇళ్లు, వాహనాలపై పడి ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెట్రో సేవలపైనా తీవ్ర ప్రభావం చూపింది.

Advertisement

Next Story

Most Viewed