రైల్వే ట్రాక్ పై హైటెన్షన్ వైర్.. తప్పిన ఘోర ప్రమాదం

by Y.Nagarani |
రైల్వే ట్రాక్ పై హైటెన్షన్ వైర్.. తప్పిన ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో రైల్వే ట్రాక్ లపై వివిధ వస్తువులను అడ్డంగా ఉంచి.. ప్రమాదాలను సృష్టించేందుకు అగంతకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నింటినీ అధికారులు ముందే పసిగట్టి.. రైళ్లను ఆపి ట్రాకులకు అడ్డంగా ఉంచిన వస్తువుల్ని తొలగించారు. సిమెంటు దిమ్మెలు, గ్యాస్ సిలిండర్, సైకిల్..ఇలా రకరకాల వస్తువులను ట్రాక్ కు అడ్డంగా పెట్టారు. తాజాగా.. అలాంటి ఘటనే మరొకటి ఉత్తరాఖండ్ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. ఈసారి దుండగులు ట్రాక్ పై హైటెన్షన్ విద్యుత్ వైరును ఉంచారు. లోకో పైలట్లు ముందే గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది.

మంగళవారం తెల్లవారుజామున డెహ్రాడూన్ - తనక్ పూర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ఖతిమా రైల్వే స్టేషన్ దాటి తర్వాత ట్రాక్ పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ విద్యుత్ వైరు పడి ఉంది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్స్ రైలును నిలిపివేసి.. రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు హై టెన్షన్ విద్యుత్ వైరును తొలగించిన తర్వాత రైలు అక్కడి నుంచి కదిలింది. హైటెన్షన్ విద్యుత్ వైరును లోకో పైలట్లు ముందుగానే గుర్తించకపోయి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేది.

ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్, ఉత్తరాఖండ్ సీనియర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. భారతీయ న్యాయ్ సంహిత్ (BNS)లో సంబంధిత సెక్షన్ల కింద గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో ప్రయాగ్ రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్ ప్రెస్ రైలుకు అడ్డంగా ఎల్పీజీ సిలిండర్ ను ఉంచారు. దానిని లోకో పైలట్ గమనించి బ్రేక్ వేసినా రైలు ఆగలేదు. స్లో గా సిలిండర్ ను ఢీ కొట్టి ఆగింది. అదే రైలు స్పీడుగా ఉన్నప్పుడు సిలిండర్ ను ఢీ కొట్టి ఉంటే.. పెద్దప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed