- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవయవ మార్పిడి డాక్యుమెంటేషన్‌కు వాట్సాప్, మెయిల్ నోటిఫికేషన్‌ను తప్పనిసరి: ఢిల్లీ హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: అవయవ మార్పిడి ప్రక్రియలో కమ్యూనికేషన్, ప్రక్రియను మరింత పెంపొందించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దాతలు, గ్రహీతలు తమ డాక్యుమెంటేషన్‌లో ఏవైనా లోపాలు ఉంటే వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ప్రక్రియను క్రమబద్దీకరించడం, సకాలంలో కమ్యూనికేషన్ కోసం నిర్ణయించినట్టు హైకోర్టు పేర్కొంది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో కమ్యూనికేషన్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుందని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ అభిప్రాయపడ్డారు. డాక్యుమెంటేషన్ లేదా ఏదైనా ఫార్మాలిటీలలో లోపాల గురించి దాత లేదా గ్రహీత మధ్య అవసరం వచ్చినప్పుడు వారు లేదంటే వారి బంధులలో ఎవరికైనా వాట్సాప్, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ల ద్వారా మాట్లాడవచ్చని ఆమె స్పష్టం చేశారు. కిడ్నీ మార్పిడికి సంబంధించి సర్ గంగారాం హాస్పిటల్ వారు ఆలస్యం చేసిన ఘటనకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. దురదృష్టవశాతు సదరు రోగి 2021, మార్చి-ఏప్రిల్‌లో మరణించాడు.