Hemant Soren: బిస్వశర్మపై అసత్య ఆరోపణలు మానుకోవాలి.. జార్ఖండ్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

by vinod kumar |
Hemant Soren: బిస్వశర్మపై అసత్య ఆరోపణలు మానుకోవాలి.. జార్ఖండ్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ జార్ఖండ్ ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కో-ఇన్‌చార్జ్, అసోం సీఎం హిమంత బిస్వ శర్మ లపై జార్ఖండ్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ స్పందించింది. బిస్వశర్మపై అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించింది. ఒక రాష్ట్రానికి చెందిన సీఎం భారత యూనియన్‌లోని మరో రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, ఇతర ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేయగలరా అని ప్రశ్నించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిస్వ శర్మలపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడింది. కాగా, శివరాజ్, బిస్వశర్మలు నిరంతరం జార్ఖండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది.

Advertisement

Next Story