డ్రైనేజ్‌లో కుప్పలు తెప్పలుగా డబ్బుల కట్టలు.. ఎగబడి ఎత్తుకెళ్లిన జనం (వీడియో)

by sudharani |
డ్రైనేజ్‌లో కుప్పలు తెప్పలుగా డబ్బుల కట్టలు.. ఎగబడి ఎత్తుకెళ్లిన జనం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రైనేజ్‌లో కుప్పలు తెప్పలుగా డబ్బు కట్టలు కొట్టుకు వచ్చాయి. అన్ని రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లే ఉన్నాయి. దీంతో స్థానికులు కాల్వలోకి దూకి నోట్ల కట్టలు ఎవరికి దొరికినంత వారు ఎత్తుకెళ్లారు. ఈ వింత సంఘటన బిహార్‌లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ససారం జిల్లా మొరదాబాద్‌లోని ఓ నీటి కాల్వలోకి నోట్ల కట్టలు కొట్టుకు వచ్చాయి. వాటిని అక్కడే ఎవరైనా వేశారా.. లేక ఎక్కడి నుంచైనా కొట్టుకు వచ్చాయో తెలియదు కానీ అన్నీ రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లే ఉన్నాయి. అయితే అది చూసిన స్థానికులు మొదట నిర్ఘాంతపోయారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు కాల్వలోకి వెళ్లి ఎవరికి దొరికినన్నీ వారు తీసుకెళ్లారు. అయితే కొద్ది సేపటికే ఈ విషయం ఊరు మొత్తం వ్యాపించింది.

దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కానీ.. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లే సరికి అంత అయిపోయింది. అక్కడ వారికి ఎలాంటి కరెన్సీ నోట్లు దొరకలేదు. అయితే ఆ నోట్లు ఎలా వచ్చాయి..? ఎక్కడ నుంచి వచ్చాయి..? ఎవరైనా వాటిని కాల్వలో పడేశారా..? అసలు అవి నిజమైన నోట్లా నకిలీ నోట్లా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా.. అవి నిజమైన నోట్లో అని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed