Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై నివేదిక కోరిన ఆరోగ్యశాఖ

by Shamantha N |
Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై నివేదిక కోరిన ఆరోగ్యశాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. తిరుపతి లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ ఆరోపణలపై సమగ్ర నివేదిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కేంద్ర మంత్రి జేపీ నడ్డా కోరారు. కేంద్రం ఈ విషయంలో ఏపీకి పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇకపోతే, ఈ అంశంపైన ఆహారమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. చంద్రబాబు మాట్లాడే అంశం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రహ్లాద్ జోషి అన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు.

అసలు వివాదం ఏంటంటే?

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో తిరుమల లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో పంది, గొడ్డు కొవ్వు.. చేప నూనె వంటివి కలగలసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (NDDB) కాఫ్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ తెలిపింది. గురువారం ఆ నివేదికను విడుదల చేసింది. దీనిపైనే కేంద్రం స్పందించింది. ఏపీ సీఎం దగ్గర్నుంచి సమగ్ర నివేదికను కేంద్రమంత్రి జేపీ నడ్డా కోరారు.

Advertisement

Next Story

Most Viewed